రాయకూర్ లో ఘనంగా ఎడ్ల పొలాల అమావాస్య

52பார்த்தது
రాయకూర్ లో ఘనంగా ఎడ్ల పొలాల అమావాస్య
రుద్రూర్ మండలం రాయకుర్ గ్రామంలో ఎడ్ల పొలాల అమావాస్య పండగను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ పండుగ నేపథ్యంలో అన్నదాతల ఇండ్లలో పండగ వాతావరణం నెలకొంది. ఎడ్లను శుభ్రంగా కడిగి రంగులను అద్ది అలంకరించారు. కొమ్ములకు రంగులు వేసి కాళ్లకు గజ్జలు కట్టి ముకుతాడు కట్టి ఒకరితో ఒకరు పోటీపడుతూ అందంగా అలంకరించారు. అనంతరం హనుమాన్ మందిరం చుట్టూ తిప్పారు.