బాన్సువాడలో ఆల్ ఇండియా స్టూడెంట్స్ బ్లాక్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు బైరాపూర్ రవీందర్ గౌడ్ ఆదివారం విలేకర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. పెండింగ్ లో ఉన్న ఇంటర్, డిగ్రీ, పీజీ కళాశాలల స్కాలర్షిప్ లు, ఫీజు రియంబర్స్మెంట్ లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల చదువులకు ఎలాంటి ఆటంకాలు కలుగకుండా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే నిర్ణయం తీసుకోవాలని పేర్కొన్నారు.