కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం కొమలంచ గ్రామంలో మంగళవారం హిందూ వాహిని సభ్యులు పాఠశాలకు వెళ్లి ప్రధానోపాధ్యాయులతో మాట్లాడి పాఠశాలను బంద్ చేయించారు. ఈ సందర్భంగా హిందూ వాహిని సభ్యులు శ్రీకాంత్ మాట్లాడుతూ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా హిందూ దేవతల విగ్రహాల పై జరుగుతున్న దాడులకు నిరసనగా ఈ బంద్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.