హైదరాబాద్ సోమాజిగూడలో చెన్నూర్ సెగ్మెంట్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిని బుధవారం మాలమహానాడు అంబేద్కర్ సంఘం బాన్సువాడ నేతలు మర్యాదపూర్వకంగా కలసి సత్కరించారు. డిసెంబర్ 1న హైదరాబాద్లో జరిగే మాలల సింహాగర్జన బహిరంగ సభను విజయవంతం చేయాలని వివేక్ సూచించారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బంగారు మైసయ్య, బాన్సువాడ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నేర్రే నర్సింలు వున్నారు.