సికింద్రాబాద్ మెట్టుగూడ జంక్షన్, హోటల్ స్కైలాబ్ వద్ద యూటర్ను తిరిగి ప్రారంభించాలని ట్రాఫిక్ సీఐ శ్రీనివాస్ ని స్థానిక కార్పొరేటర్ రాసురి సునీత కోరారు. మంగళవారం జంక్షన్‌ను అధికారులతో కార్పొరేటర్ పరిశీలించారు. యూటర్ను తొలగించడం వల్ల బస్తీ వాసులకు ట్రాఫిక్ ఇబ్బందులతో పాటు అంబులెన్స్ రాకపోకలకు తీవ్ర ఆటంకం ఉందని కార్పొరేటర్ వివరించారు. ఈ కార్యక్రమంలో బస్తీ వాసులు, జీహెచ్ఎంసీ అధికారులు పాల్గొన్నారు.