సికింద్రాబాద్ లోని పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయ పికెట్ ను మంగళవారం తెలంగాణ రాష్ట్ర విద్యా కమిషన్ ఛైర్మన్, మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి, సభ్యురాలు జ్యోత్స్న శివారెడ్డి సందర్శించారు. మౌలిక సదుపాయాలు, బోధన పద్ధతులు, సంపూర్ణ అభ్యాసానికి సంబంధించిన సౌకర్యాలను పరిశీలించారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను మార్పు కోసం నూతన విద్య విధానాలను చేయటానికి విద్య కమిషన్ అధ్యయనం చేస్తుందని ఆకునూరు మురళి తెలిపారు.