ఈ నెల 29న తెలంగాణ భవన్ లో నిర్వహించే దీక్షా దివస్ కు పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ బుధవారం పిలుపునిచ్చారు. వెస్ట్ మారేడ్‌పల్లిలోని తన కార్యాలయం వద్ద సనత్ నగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులతో సమావేశం నిర్వహించారు. రాష్ట్ర సాధకుడు, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమాన్ని కీలక మలుపు తిప్పిందని పేర్కొన్నారు.