రసూలురాలోని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ (యూ పి హెచ్ సి), సీబీఎన్ నగర్ లోని బస్తీ దవాఖానాలను సోమవారం ఎమ్మెల్యే శ్రీ గణేశ్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని పరిస్థితుల పట్ల ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తుండటంతో సిబ్బంది నిర్లక్ష్యం పట్ల వారిని ఎమ్మెల్యే హెచ్చరించారు. అనంతరం స్టాఫ్ హాజరు పట్టికను పరిశీలించి, విధుల పట్ల నిర్లక్ష్యంగా ఉండకూడదన్నారు.