రాంగోపాల్‌పేట డివిజన్ చుట్టలబస్తీలో వీధి దీపాలకు అధికారులు సోమవారం మరమ్మతులు చేయించారు. కొద్దిరోజులుగా వీధి దీపాలు వెలుగకపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయం కాంగ్రెస్ పార్టీ సనత్‌నగర్ నియోజకవర్గ ఇన్చార్జి కోట నీలిమ దృష్టికి తీసుకురావడంతో అధికారులతో మాట్లాడి సమస్యలు పరిష్కరించారు. దీంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.