డివిజన్ ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు సనత్ నగర్ కార్పొరేటర్ కొలను లక్ష్మీబాల్ రెడ్డి అన్నారు. శివాజీనగర్ లోని శివాజీ విగ్రహం నుంచి ఎస్సార్టీ క్వార్టర్స్ వరకు రూ. 12 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను మంగళవారం ఆమె ప్రారంభించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అభివృద్ధి కుంటు పడిందన్నారు. త్వరగా పనులను పూర్తి చేయాలన్నారు.