మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబ సర్వేపై చేసిన వ్యాఖ్యలపై ఏఐసీసీ మెంబర్ కోట నీలిమ మంగళవారం కౌంటర్ ఇచ్చారు. ఇది కేవలం కుల గణన మాత్రమే కాదని, ఇది సకుటుంబ సర్వే అని అన్నారు. కుటుంబ సభ్యుల ఆర్థిక, సామాజిక, విద్య, ఉపాధి సహా అన్నిటిని తెలుసుకుని ప్రభుత్వం పథకాలను అందించేందుకు చేస్తుందన్నారు. కులగణనకు ఆధార్ కార్డు ఎందుకని? తలసాని అనగా.. ఆధార్ కార్డుతోనే ఐడెంటిటీ గుర్తిస్తారని కౌంటర్ ఇచ్చారు.