నర్సింగ్ కళాశాల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంగళవారం బాన్సిలాల్ పేట్ డివిజన్ లోని భోయగూడ గాంధీ ఆసుపత్రికి అనుబంధంగా నిర్వహిస్తున్న ప్రభుత్వ నర్సింగ్ కళశాలను ఎమ్మెల్యే సందర్శించారు. కళాశాలలో ఉన్న సమస్యలను విద్యార్థులు ఉపాధ్యాయులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. సమస్యలను తప్పకుండా పరిష్కరిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.