సనత్ నగర్ ఈఎస్ఐ లోని గవర్నమెంట్ ఆయుర్వేద కళాశాలలో 9వ ఆయుర్వేద దినోత్సవ వేడుకలను మంగళవారం నిర్వహించారు. ఈ వేడుకలో తెలంగాణ రాష్ట్ర హెల్త్ మెడిసిన్& ఫ్యామిలీ సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ దామోదర రాజనర్సింహ పాల్గొన్నారు. ఆయనను కళాశాల యాజమాన్యం శాలువాతో సత్కరించి పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. రాష్ట్రంలో మెరుగైన వైద్యాన్ని ప్రజలకు అందించేలా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.