కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా సనత్ నగర్ లోని శివాలయంలో భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు. మందిరంలో ఉన్న శివలింగానికి అభిషేకం చేసి ప్రూట్స్ తో అలంకరణం చేశారు. సాయంత్రం లక్ష దీపోత్సవంలో భక్తులు పాల్గొని దీపాలను వెలిగించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు.