నర్సింగ్ కళాశాల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని మంగళవారం మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బన్సీలాల్ పేట డివిజన్లోని బోయగూడ గాంధీ ఆసుపత్రికి అనుబంధంగా నిర్వహిస్తున్న ప్రభుత్వ నర్సింగ్ కాలేజీని ఎమ్మెల్యే సందర్శించారు. కళాశాలలో ఉన్న సమస్యలను విద్యార్థులు, ఉపాధ్యాయులు ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.