బాలానగర్ బస్టాప్ వద్ద రహదారిపై పెను ప్రమాదం తప్పింది. బస్టాప్ వద్ద రోడ్డుపై మట్టిని డంప్ చేశారు. రోడ్డు మధ్య వరకు మట్టి ఉంది. రోడ్డుపై లైటింగ్ లేకపోవడంతో మట్టి వైపు కార్లు దూసుకెళ్లాయి. వెంటనే డ్రైవర్లు అప్రమత్తం కావడంతో ప్రమాదం తప్పింది. అధికారులు వెంటనే రోడ్డుపై ఉన్న మట్టిని తొలగించాలని వాహనదారులు కోరారు.