హైదరాబాద్ లోని నిమ్స్ లో చికిత్స పొందుతున్న వాంకిడి ఆశ్రమ పాఠశాల విద్యార్థిని శైలజ (16) సోమవారం మృతి చెందింది. సెప్టెంబర్ 30న కొమురం భీం జిల్లా వాంకిడి పాఠశాలలో కలుషిత ఆహారం తిని పలువురు విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ఈ క్రమంలోనే శైలజను చికిత్స కోసం నిమ్స్ లో చేర్చారు. ఇటీవల ఆమెను రాష్ట్ర మంత్రులు, బీఆర్ఎస్ నేతలు పరామర్శించారు. అయితే పరిస్థితి విషమించడంతో కొద్దిసేపటి క్రితమే శైలజ తనువు చాలించింది.