హైదరాబాద్ లో జరిగే కోటిదీపోత్సవంలో గురువారం కేంద్రమంత్రి కిషన్రెడ్డి పాల్గొన్నారు. గత సంవత్సరం కోటిదీపోత్సవానికి ప్రధాని నరేంద్ర మోడీ వచ్చారు. ఈ సంవత్సరం రాష్ట్రపతి వస్తున్నారు. ఈ నెల 21వ తేదీన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కోటిదీపోత్సవంలో పాల్గొంటారు. 18వ తేదీన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ హాజరవుతారు అని కేంద్రమంత్రి కిషన్రెడ్డి తెలిపారు.