రాష్ట్రంలో నిత్యం కుక్కల దాడికి చిన్నారులు గాయపడుతూనే అన్నారు. కూకట్ పల్లిలోని బాలానగర్ లో కుక్కల స్త్వైరావిహారం దాటికి సుమారు సుమారు 25 మంది గాయపడిన ఘటన కలకలం రేపుతోంది. ఇందులో 16 మంది తీవ్రంగా గాయపడ్డారని స్థానికులు వాపోతున్నారు. వీరిలో చిన్నారులు తీవ్ర గాయాలతో విలవిలలాడుతున్నారు. తల్లితండ్రులు వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు వారిని ఆదివారం పరామర్శించారు.