పార్కుల సుందరీకరణ కోసం ప్రత్యేక చర్యలు
పార్కుల సుందరీకరణ కోసం జీహెచ్ఎంసీ ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ అనురాగ్ జయంతి అన్నారు. గురువారం జూబ్లీహిల్స్ సర్కిల్ 45లో ఉన్న జీహెచ్ఎంసీ పార్కులో కొనసాగుతున్న సుందరీకరణ పనులను పరిశీలించారు. పనులను వేగవంతం చేయాలని సంబంధిత సిబ్బందికి సూచించారు. ప్రధానంగా పచ్చదనం పెంపుపై దృష్టి సారించాలని సూచించారు.