గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంపై జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో జోనల్ కమిషనర్లు, అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు, వినతులను సకాలంలో పరిష్కరించాలని ఆదేశించారు. ఎటువంటి అలసత్వం వహించకుండా అధికారులు చొరవ చూపాలని ఆదేశించారు.