ఏబీవీపీ కోఠి జిల్లాలోని స్థానిక సిటీ కళాశాల ఆధ్వర్యంలో భారత రత్న డా. బీఆర్. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా సామాజిక సమరసత దినోత్సవం ఘనంగా నిర్వహించారు. వారి చిత్ర పటానికి పూలమాలలతో నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కోఠి జిల్లా కన్వీనర్ సభావట్ కళ్యాణ్ మాట్లాడుతూ డా. బీ. ఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రతి భారతియుడికి ఎంతో అవసరం అన్నారు.