చట్ట విరుద్ధంగా పుస్తకాలను అమ్ముతున్న పాఠశాల పై చర్యలు తీసుకోవాలి

391பார்த்தது
చట్ట విరుద్ధంగా పుస్తకాలను అమ్ముతున్న పాఠశాల పై చర్యలు తీసుకోవాలి
ఏబీవీపీ కోఠి జిల్లా ఆధ్వర్యంలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్దంగా పాఠశాలల్లో పుస్తకాలు అమ్ముతున్న స్థానిక గోషామహల్ శ్రీచైతన్య హై స్కూల్ నందు శనివారం ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా ఏబీవీపీ కోఠి జిల్లా కన్వీనర్ సభావట్. కళ్యాణ్ మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కుతూ విద్యార్థుల వద్ద నుండి అధిక ఫీజులు వసూలు చేస్తూ ఇబ్బందులకి గురి చేస్తున్నారని అదే కాకుండా ప్రభుత్వ నిబంధనలకు విరుద్దంగా స్కూల్లాల్లో పాఠ్యపుస్తకాలు అమ్ముతూ విద్యార్థులని ఇబ్బంది పెడ్తున్నారని అన్నారు. ఇలాంటి పాఠశాలల పైన చర్యలు తీసుకోవాలని స్థానిక ఎంఈఓ కి ఎన్ని సార్లు చెప్పిన నిమ్మకు నీరేతినట్లు వ్యవహారిస్తున్నారని ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలకు కొమ్ము కాస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరిచి అలాంటి పాఠశాలల పైన చర్యలు తీస్కొని యాజమాన్యం పైన కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేసారు. లేని యెడల రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమం చేసి ఎంఈఓ ని అధికారం నుండి తొలగించేలా చేస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో చార్మినార్ నగర కార్యదర్శి నితిన్, అధ్యక్షులు దిలీప్, సిటీ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ సజన్, ఎస్ఎఫ్ఎస్ కన్వీనర్ అఖిల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

டேக்ஸ் :

Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி