నారాయణగూడలోని వైఎంసీఏ సదర్ సమ్మేళనంలో యాదవుల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొని సదర్ వేడుకలు యాదవుల ప్రతీక అని అన్నారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ ఎన్. గౌతమ్ రావు, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్ర రెడ్డి, రామన్ గౌడ్ దంపతులు, యాదవ సోదరులు గడ్డం శ్రీనివాస్ యాదవ్, వినోద్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.