గుజరాత్‌లోని వల్సాద్ జిల్లాలో మహా శివరాత్రి వేడుకలు చాలా కోలాహలంగా ప్రారంభమయ్యాయి. దుల్సాద్ గ్రామంలో ముప్పై ఆరు లక్షల రుద్రాక్షలతో 36 అడుగుల ఎత్తైన శివలింగాన్ని రూపొందించారు. మహా శివరాత్రి సందర్భంగా దీనిని ఏర్పాటు చేశారు. ఇది ప్రపంచంలోనే ఎత్తైన రుద్రాక్ష శివలింగంగా ఇండియా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది. ఈ శివలింగాన్ని 56 మంది 78 రోజుల పాటు శ్రమించి రూపొందించారు.