నాగర్ కర్నూలు జిల్లా తాడూరు మండలం సిరసవాడలో గురువారం జిల్లా కలెక్టర్ బాధవాత్ సంతోష్ కొనుగోలు కేంద్రానికి వచ్చిన వరి ధాన్యాన్ని పరిశీలించారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. రైతులు పూర్తి నాణ్యత ప్రమాణాలతో ధాన్యాన్ని తీసుకువచ్చేలా అవగాహన కల్పించాలని, ఎక్కడైనా తూకంలో కొనుగోలు కేంద్రం నిర్వాహకులు మోసం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.