గ్రూప్ 3 పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ తెలిపారు. గురువారం నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టరేట్ లో సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ ఈనెల 17, 18 తేదీలలో నిర్వహించే గ్రూప్ 3 పరీక్ష కేంద్రంలోకి వెళ్లే అభ్యర్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసి లోపలికి పంపించాలని ఆదేశించారు. ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదని తెలిపారు.