నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ఎన్. పిఆర్డి వికలాంగుల సంఘం ముట్టడించింది. జిల్లా అధ్యక్షుడు ఆర్. శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా వికలాంగులకు వెంటనే ఆరువేల రూపాయల వికలాంగుల పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఏర్పడి 11 నెలలైనా ఇప్పటికీ పెన్షన్ పెంపు అమలు చేయలేదని అన్నారు.