దుందుభి వాగులో దూకి మహిళ ఆత్మహత్య
దుందుభి వాగులో దూకి ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మహబూబ్ నగర్ జిల్లాలో శనివారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాలు ప్రకారం. రాజాపూర్ మండలం గుండ్లపొట్లపల్లికి చెందిన చెన్నమ్మ (48) చెన్నయ్య భార్యభర్తలు. శుక్రవారం రాత్రి గ్రామంలోని కొందరికి ఫోన్ చేసి తాను దుందుభి నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడుతున్నానని చెప్పింది. తరువాత ఆచూకీ లభించలేదు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దుందుభి నదిలో గాలింపు చర్యలు చేపట్టారు.