నిర్మాణ కార్మికుల కష్టాలు తీర్చాలి
ఇసుకపై నిషేధం ఎత్తివేసి భవన నిర్మాణ కార్మికుల కష్టాలు తీర్చాలని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డికి భవన నిర్మాణ కార్మికుల సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని అందజేశారు. భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీనివాసులు మాట్లాడుతూ ఇసుకకొరత వల్ల మేస్త్రీలకు పనులు దొరకటం లేదన్నారు. ఎమ్మెల్యే ఇసుకపై దృష్టి పెట్టి ఇసుక దొరికే విధంగా చర్యలు చేపట్టి కార్మికులకు ఉపాధి కల్పించాలని కోరారు.