మహిళ అంటే అబల కాదు సబల అని నిరూపించాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలో మహబూబ్ నగర్ ఫస్ట్ లో కంప్యూటర్, టైలరింగ్, బ్యూటీషన్ కోర్సులకు 240 మంది విద్యార్థులతో శిక్షణా తరగతులను ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు జిల్లెల చిన్నారెడ్డితో కలిసి ప్రారంభించారు. ఎమ్మెల్యే మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని, మహబూబ్ నగర్ ఫస్ట్ ఎందరో జీవితాల్లో వెలుగులు నింపాలని చిన్నారెడ్డి అన్నారు.