గట్టు మండల పరిధిలోని ఆలూరు గ్రామానికి చెందిన రామాంజనేయులు గుండెపోటు కారణంగా మరణించిన విషయం తెలుసుకుని, బిఆర్ఎస్ పార్టీ నాయకులు బాసు హనుమంతు గురువారం వెంటనే వారి స్వగృహానికి వెళ్లి ఆయన భౌతిక కాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరఫున సహాయం చేస్తామని బాసు హనుమంతు హామీ ఇచ్చారు.