10వ తరగతి పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి సూచించారు. మంగళవారం కోడూరు జడ్పీఎచ్ఎస్ ను ఎమ్మెల్యే ఆకస్మికంగా తనిఖీ చేశారు. డిజిటల్ విధానంలో బోధన తీరును పరిశీలించారు. 10వ తరగతి విద్యార్థులకు మంచి విద్య అందించాలనే ఉద్దేశంతో అన్ని సబ్జెక్టులకు సంబంధించిన మెటీరియల్స్ ను పెన్ డ్రైవ్ లో శుక్రవారం లోగా అందిస్తానని, డిజిటల్ తరగతులను విద్యార్థులకు బోధించాలన్నారు.