కాంగ్రెస్ ప్రభుత్వం క్రీడలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అన్నారు. అడ్డాకుల మండలం రాచాల జడ్పీ ఉన్నత పాఠశాలలో మంగళవారం 68వ ఎస్జిఫ్ క్రీడలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతుల అందజేసి మాట్లాడారు. సీఎం చరిత్రలో ఎన్నడు లేని విధంగా 364కోట్ల రూపాయల నిధులను క్రీడా శాఖకు కేటాయించారని జిల్లాకు స్పోర్ట్స్ యూనివర్సిటీ, నియోజకవర్గంలో ఇండోర్ స్టేడియం నెలకొల్పలే ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు.