తెలంగాణ ప్రభుత్వం.. నిరుద్యోగ మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది. ఉమెన్ కో ఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పోరేషన్ ద్వారా ఉచితంగా ఈవీ ఆటో, టూ వీలర్ డ్రైవింగ్ శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపింది. ఈ కార్పొరేషన్ ద్వారా 18-45 ఏళ్ల మహిళలకు 45-60 రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొంది. డ్రైవింగ్ నేర్చుకున్న మహిళలకు సబ్సిడీపై ఈవీ ఆటోలు అందివ్వనున్నట్లు ప్రకటించింది. ఇప్పటివరకు 45 మందికి ట్రైనింగ్ ఇవ్వగా, వచ్చే నెల 5 నుంచి కొత్త బ్యాచ్ ప్రారంభం కానుంది.