మ్యాట్రిమోనియల్ సైట్‌లో పరిచయమైన ఓ మహిళ పెళ్లి పేరుతో మోసం చేసి ఏకం రూ.91 లక్షలు కొట్టేసింది. పూణెకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌కు ఏడాది క్రితం ఓ మహిళ పరిచయం అయింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. బ్లెస్ కాయిన్‌లో పెట్టుబడి చేస్తే పెళ్లి తర్వాత భవిష్యత్ బాగుంటుందని మభ్యపెట్టింది. ఆమె మాటలు విన్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ రూ.91.75 లక్షలు ఇన్వెస్ట్ చేశారు. అయితే డబ్బులు ఎన్నిరోజులైన రిటర్న్ రాకపోవడంతో మోసపోయానని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.