అజినమోటోను మోమోస్ తయారీలో ఉపయోగించడం వల్ల ఇది క్యాన్సర్ కారకంగా మారే అవకాశం ఉందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అనారోగ్యకరమైన కొవ్వులతోనూ, మైదాతోను తయారు చేసే ఈ మోమోస్ తినడం ఏ మాత్రం మంచిది కాదని చెబుతున్నారు. మోమోస్ తినడం వల్ల బరువు పెరుగుతుంది. గుండె జబ్బులు వస్తాయి. మధుమేహ వ్యాధిని పెంచుతుంది. ఆరోగ్యంగా ఉండాలనుకునే వారు.. స్ట్రీట్ ఫుడ్‌లో విపరీతంగా విక్రయిస్తున్న ఈ మోమోస్‌ను తినకుండా ఉంటేనే మంచిదని హెచ్చరిస్తున్నారు.