తెలంగాణలో కులగణన ఎక్స్ రే మాత్రమే కాదని.. ఇది మెగా హెల్త్ చెకప్ లాంటిదని సీఎం రేవంత్ అన్నారు. భవిష్యత్ లో కేంద్ర ప్రభుత్వం చేపట్టే జనగణనలో మన మోడల్ ను పరిగణనలోకి తీసుకునేలా మోడల్ డాక్యుమెంట్ ను కేంద్రానికి పంపుతామని చెప్పారు. కులగణనపై సమన్వయం చేసుకునేందుకు 33 జిల్లాలకు 33 మంది అబ్జర్వర్స్ ను నియమించాలని అధికారులకు సూచించారు. నవంబర్ 31లోగా కులగణన పూర్తి చేసి భవిష్యత్ యుద్ధానికి సిద్ధం కావాలన్నారు.