'పెద్ద పెద్ద కళ్ళతోటి' సాంగ్ లిరిక్స్

542பார்த்தது
'పెద్ద పెద్ద కళ్ళతోటి' సాంగ్ లిరిక్స్
పెద్ద పెద్ద కళ్ళతోటి
నా చిన్ని చిన్ని గుండెలోకి
తొంగి తొంగి చూసినావె ఓ పిల్లా

అల్లి బిల్లీ నవ్వు తోటి
నా బుల్లి బుల్లి మనసు తాకి
గిల్లి గిల్లి చంపినావే ఓ బాల

చందమామా చుట్టూరా చుక్కలున్నట్టు
నన్ను చుట్టూ ముట్టాయే నీ ఊహలే
పుట్టలోన వేలు పెడితే
చీమ కుట్టి నట్టు
నన్ను పట్టి కుట్టయిలే


పెద్ద పెద్ద కళ్ళతోటి
నా చిన్ని చిన్ని గుండెలోకి
తొంగి తొంగి చూసినావె ఓ పిల్లా
ఓహ్ ఏఆహ్

ఓ ఇంగ్లీష్ బాషా మీద పట్టు లేదే
తెలుగు లోని ఛందస్సు చదవలేదే
హిందీ లో షాయరీ మనకు రాధే
నాలో కవిత్వాలు ఘనత నీదే
ఆత్రేయ గొప్పతనం తెలుసు కున్న
వేటూరి చిలిపి తనం మెచ్చుకున్నా

ఎన్నాళ్ళో నుంచి విన్న పాటలైనా
ఈరోజే నాకు నచ్చి పడుతున్న
పాతికేళ్ల కొచ్చాకే నడక నేర్చినట్టు
అడుగుకెన్ని తప్పటడుగులా

పెద్ద పెద్ద కళ్ళతోటి
నా చిన్ని చిన్ని గుండెలోకి
తొంగి తొంగి చూసినావె ఓ పిల్లా
ఓ ఏఆహ్

భూకంపమంటే భూమి ఊగిపోవడం
సైక్లోన్ అంటే ఉప్పెనోచి ముంచడం
ఈ రెంటికన్నా చాల పెద్ద ప్రమాదం
గుప్పెడంత గుండెలోకి నువ్వు దూరడం

ఒంట్లోని వేడి పెరిగితే చలి జ్వరం
నిద్దట్లో ఉలికి పాటు పేరు కలవరం
ఈ రెంటికన్నా చాల వింత లక్షణం
తెల్లార్లు నీ పేరే కలవరించడం
ఇన్ని నాళ్ళు నా జంటను ఉన్న ఏకాంతం
నిన్ను చూసి కుళ్ళు కుండీలు

పెద్ద పెద్ద కళ్ళతోటి
నా చిన్ని చిన్ని గుండెలోకి
తొంగి తొంగి చూసినావె ఓ పిల్లా

டேக்ஸ் :

Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி