ఆదిలాబాద్: వికలాంగులకు రూ. 6 వేల పెన్షన్ ఇవ్వాలి

59பார்த்தது
ఆదిలాబాద్: వికలాంగులకు రూ. 6 వేల పెన్షన్ ఇవ్వాలి
అసెంబ్లీ ఎన్నికల్లో వికలాంగులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో సీఎం రేవంత్ రెడ్డి విఫలమయ్యారని వి. హెచ్. పి. ఎస్ జాతీయ అధ్యక్షురాలు సుజాత అన్నారు. వికలాంగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శనివారం ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట వి. హెచ్. పి. ఎస్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నప్పటికీ వికలాంగులకు రూ. 6 వేలు, వృద్ధులు, ఒంటరి మహిళలకు రూ. 4 వేలు పెన్షన్‌ను అమలు చేయడం లేదన్నారు.

தொடர்புடைய செய்தி