కాంట్రాక్ట్ ఏఎన్ఎంల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట సీఐటీయు ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సీఐటీయు జిల్లా సహాయ కార్యదర్శి నవీన్ మాట్లాడుతూ.. గతంలో కాంట్రాక్ట్ ఏఎన్ఎంలు సమ్మె చేపట్టినప్పుడు ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. పరీక్ష విధానాన్ని రద్దుచేసి ఏఎన్ఎం లను రెగ్యులర్ చేయాలని పేర్కొన్నారు.