అంగన్వాడి కేంద్రాలను పరిశీలించిన ఫుడ్ కార్పొరేషన్ ఛైర్మన్

69பார்த்தது
ఆదిలాబాద్‌లోని మహాలక్ష్మివాడ, భుక్తాపూర్, శాంతినగర్‌లోని అంగన్వాడీ కేంద్రాలను రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ ఛైర్మన్ ఫహీమ్ సోమవారం తనిఖీ చేశారు. బాలామృతం సరఫరా పంపిణీపై అంగన్వాడీ కేంద్ర అధికారులతో సమీక్షించారు. ఈ మేరకు బాలామృతం పంపిణీ రికార్డులను ఆయన పరిశీలించి పలు సూచనలు చేశారు. పిల్లలు బరువును పరిశీలించారు. మహిళలతో మాట్లాడి అంగన్వాడీ ద్వారా అందిస్తున్న సేవలను తెలుసుకున్నారు. వీరి వెంట ఆర్డీవో వినోద్ కుమార్ ఉన్నారు.

தொடர்புடைய செய்தி