అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో అరెస్ట్ అయిన కన్నడ నటుడు దర్శన్ జైలు నుంచి విడుదల అయ్యారు. తాజాగా ఈ కేసులో కర్ణాటక హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. కోర్టు తీర్పుతో దాదాపు నాలుగు నెలల తర్వాత ఆయన జైలు నుంచి బయటకు వచ్చారు. దర్శన్ సన్నిహితురాలు పవిత్ర గౌడకు సంబంధించిన అసభ్యకర ఫొటోలు పంపించాడన్న ఆరోపణలతో రేణుకాస్వామిని హత్య చేసినట్లు విచారణలో తేలింది. దర్శన్‌కు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.