ఉరవకొండ పట్టణ సబ్ డివిజనల్ ఏడీఈగా భాస్కర్ బాధ్యతలు
ఉరవకొండలోని సబ్ డివిజనల్ కు ఏడీఈగా భాస్కర్ బాధ్యతలు స్వీకరించారు. ముందుగా కార్యాలయ అధికారులు పుష్పగుచ్చం అందజేసి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం విడపనకల్ మండల విద్యుత్ శాఖ కాంట్రాక్టర్ మాలాపురం కేశన్న ఏడీఈ భాస్కరను ఏడీఈ పూలమాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్బంగా భాస్కర్ మాట్లాడుతూ.. ప్రజలకు అందుబాటులో ఉండి విద్యుత్ సమస్యలు తలెత్తకుండా చూస్తానని అన్నారు.