పోరుమామిళ్ల: ఇసుక టిప్పరు స్వాధీనం
అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న టిప్పర్ ను స్వాధీనం చేసుకున్నట్లు గురువారం ఎస్ఐ కొండారెడ్డి తెలిపారు. మల్ల కత్తువ వద్ద వాహనాల తనిఖీ నిర్వహించామని చెప్పారు. ఎటువంటి అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తున్న టిప్పర్ ను గుర్తించి స్వాధీనం చేసుకున్నామన్నారు. యజమాని మైదుకూరుకు చెందిన కుర్ర వెంకటేశ్ ఫై కేసు నమోదు చేశారు.