కమలాపురం నగర పంచాయతీ టీడీపీ వశం!
కమలాపురం నగర పంచాయతీ ఇంతకాలం వైసిపికి వశమై ఉండేంది. అయితే మొన్నటి వరకు మొత్తం 20 మంది కౌన్సిలర్లకు గాను 15 మంది వైసీపీ 5 మంది టీడీపీతో ఏర్పడిన వైసిపి పాలకవర్గం తాజాగా టిడిపి పాలకవర్గంగా ఏర్పాటు కానుంది. 20 మంది కౌన్సిలర్లలో ఐదు మంది టిడిపి కాగా ఒకరు మృతి, మరొకరు రాజీనామా చేశారు. సోమవారం 5 మంది కౌన్సిలర్లు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో టిడిపిలోకి చేరారు. 5 మంది కౌన్సిలర్లు రాకతో కమలాపురం నగర పంచాయతీ టీడీపీ వశమైంది.