వైవియు అధ్యాపకులకు అంతర్జాతీయ ప్రాజెక్ట్
యోగి వేమన విశ్వవిద్యాలయం పనిచేసే ఇద్దరు ఆచార్యులకు అమెరికా వాషింగ్టన్ లోని హెల్త్ సొసైటీ పార్ట్నర్స్ సంస్థ ప్రాజెక్టును మంజూరు చేసింది. వృక్ష శాస్త్ర ఆచార్యులు పులి చంద్ర ఓబుల్ రెడ్డి, బయో టెక్నాలజీ ఆచార్యులు ప్రొ. అఖిల చంద్ర శేఖర్ ప్రాజెక్టు పత్రాలను విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య కె. కృష్ణారెడ్డి చేతులమీదుగా అందుకున్నారు. ఈ సందర్భంగా ఉపకులపతి అధ్యాపకులను అభినందించారు.