వల్లూరు మండలం గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి అధికారులు సహకరించాలని ఎమ్మెల్యే కృష్ణ చైతన్య రెడ్డి మండల అధికారులకు సూచించారు. సోమవారం వల్లూరు మండలం సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా కమలాపురం ఎమ్మెల్యే కృష్ణ చైతన్య రెడ్డి హాజరయ్యారు. మండలంలో ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని ఎమ్మెల్యే అన్నారు. మండల స్థాయి అధికారులు ప్రజాప్రతినిధులు మండల టిడిపి నాయకులు పాల్గొన్నారు.