విశాఖ ఉక్కు ప్రయివేటీకరణ ఆపాలి..
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం విశాఖ ఉక్కును తాకట్టు పెట్టే, ప్రైవేటీకరించే ప్రయత్నాలు మానుకోవాలని రైతు, కార్మిక సంఘాల జిల్లా కమిటీల ఆధ్వర్యంలో భీమవరం ప్రకాశం చౌక్‌లో గురువారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు చింతకాయలు బాబూరావు మాట్లాడారు. అనేక మంది ప్రాణ, ఆస్తి త్యాగాలతో ఏర్పడిన విశాఖ ఉక్కు నష్టాల ఊబిలో కూరుకుపోయిందని పాలకులు చెప్పడం హాస్యాస్పదమన్నారు.