పాలకోడేరు మండలం విస్సాకోడేరు ఫోరు నెంబరు పేట హౌసింగు లేవుట్ను బుధవారం పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆకస్మిక తనిఖీలు చేశారు. ప్రతి ఇంటిని పరిశీలించి, నివాసం ఉంటున్న కాలనీ మహిళలతో జిల్లా కలెక్టర్ మాట్లాడారు. కాలనీలో వర్షం వస్తే జలమయం అవుతుందని, త్రాగునీరు, డ్రైనేజీ, రహదారులు నిర్మించాలని మహిళలు జిల్లా కలెక్టరును కోరారు.